: మోదీ 'క్లీన్ ఇండియా' కార్యక్రమం చేపట్టిన శరద్ పవార్


మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికి, అవిశ్వాస పరీక్ష నెగ్గేలా ఎన్సీపీ సహకరించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని ఆ పార్టీ అధినేత శరద్ పవార్ చేపట్టారు. ఈ క్రమంలో పవార్ చీపురుపట్టారు. కుమార్తె, ఎంపీ సుప్రియా సూలె, కుటుంబసభ్యులు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, పార్టీ జనరల్ సెక్రెటరీతో కలసి తన సొంత ఊరు బారామతిలో రోడ్డు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా పలు కెమెరాలు క్లిక్కుమన్నాయి. అనంతరం మాట్లాడుతూ, "ఈ రోజు నుంచి మేము పరిశుభ్రత ప్రచారాన్ని ప్రారంభించాం" అని పవార్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News