: లక్ష్యాలు చాలానే ఉన్నాయి: రోహిత్ శర్మ


ప్రపంచ వన్డే క్రికెట్ లో రెండు డబుల్ సెంచరీలు సాధించిన టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ, వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును కూడా నమోదు చేశాడు. అయితే ఇంతటితోనే తన లక్ష్యం నెరవేరలేదని, భవిష్యత్తులో సాధించాల్సింది ఎంతో ఉందని వ్యాఖ్యానించాడు. గురువారం శ్రీలంకతో ఈడెన్ గార్డెన్ లో జరిగిన నాలుగో వన్డేలో నిన్నటిదాకా ఉన్న రికార్డులను తిరగరాసి సరికొత్త రికార్డులను నమోదు చేసిన సందర్భంగా రోహిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. తాజా రికార్డు తనపై మరింత బాధ్యతను పెంచిందన్నాడు. కెరీర్ లో మరిన్ని రికార్డులను నమోదు చేయడానికి ఈడెన్ రికార్డు ఎంతగానో ఉపయోగపడగలదని చెప్పాడు. ఈ రికార్డు సాధిస్తానని తాను ఎన్నడూ అనుకోలేదని, అయితే చిన్న వయసులో ఉండగానే టీమిండియాకు ఆడాలని ఉండేదని పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News