: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ సీఎంపై కోర్టు కేసులు
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మంఝిపై రెండు కోర్టు కేసులు నమోదయ్యాయి. దేశంలోని అగ్రకులాలవారంతా విదేశీయులేనని, దళితులు, గిరిజనులు మాత్రమే దేశవాళీ ప్రజలంటూ తాజాగా మంఝి వ్యాఖ్యానించారు. దాంతో, పురాణీ గుడ్రిలో సంజయ్ కుమార్ మిశ్రా అనే వ్యక్తి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. ఈ కేసుపై కోర్టు డిసెంబర్ 10న విచారణ చేపట్టనుంది. మరో కేసును సమస్తిపూర్ జిల్లాలోని రొశెరాలో విజయ్ మిశ్రా అనే వ్యక్తి వేశారు.