: అన్ని రాష్ట్రాల్లో సీఎస్ఐఆర్ లు: సుజనా చౌదరి
తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లోను కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చి (సీఎస్ఐఆర్) కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర శాస్త్ర, సాంకేతిక వ్యవహారాల సహాయ మంత్రి సుజనా చౌదరి ప్రకటించారు. కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన ఆయన శుక్రవారం సెంటర్ ఫర్ మాలక్యులార్ బయాలజీ (సీసీఎంబీ)ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ప్రతి యూనివర్సిటీలో ఇంక్యుబేషన్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. శాస్త్ర, విజ్ఞాన కేంద్రాలను 90 రోజుల్లోగా ప్రక్షాళన చేస్తామని ఆయన వెల్లడించారు.