: నాపై లేనిపోని అభాండాలు మోపవద్దు: నిజామాబాద్ ఎంపీ కవిత
తనపై లేనిపోని అభాండాలు మోపవద్దని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇంగ్లండ్ పర్యటన ముగించుకుని శుక్రవారం ఉదయం హైదరాబాద్ చేరుకున్న ఆమెకు శంషాబాద్ విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, తనపై లేనిపోని అభాండాలు మోపవద్దని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. సమగ్ర సర్వే సందర్భంగా తాను రెండు చోట్ల పేరు నమోదు చేయించుకున్నానన్న ఆరోపణల్లో ఎంతమాత్రం వాస్తవం లేదన్నారు. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వారైనా ఈ తరహా ఆరోపణలు చేయరని ఆమె అన్నారు.