: అభివృద్ధికి పరిశోధన తల్లి వంటింది: మోదీ
ప్రస్తుతం బ్రిస్బేన్ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇక్కడి క్వీన్స్ లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పుసక్తంలో అగ్రికల్చరల్ రోబోపై ఓ సందేశం రాయమని ప్రధానిని అధికారులు కోరారు. అందుకు "పరిశోధన అభివృద్ధికి తల్లి లాంటింది" అని హిందీలో మోదీ సందేశం రాశారు. దాన్ని విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి సయద్ అక్బరుద్దీన్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ఆగ్రో రోబో అనేది ఓ తేలికపాటి యంత్రం. అనవసరమైన మొక్కలను ఏరివేసే పనుల వంటి పలు కార్యక్రమాల్లో ట్రాక్టర్ లా విధులన్నింటినీ ఇది నిర్వహిస్తుంది. దాని గురించి తెలుసుకునేందుకు ప్రధాని యూనివర్శిటీ అంతా కలియతిరిగి చూశారు.