: చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారా? బ్రోకరా?: రఘువీరా తీవ్ర వ్యాఖ్యలు


ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో అసంబద్ధ నిర్ణయాలతో ముందుకెళుతున్న చంద్రబాబు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరిస్తున్నారని శుక్రవారం విజయవాడలో రఘువీరారెడ్డి ఆరోపించారు. అసలు చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారా? లేక బ్రోకరా? అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. భూ సమీకరణతో రైతులకు నష్టమే తప్ప లాభమెక్కడి నుంచి వస్తుందని కూడా రఘువీరా ప్రశ్నించారు. అసలు ల్యాండ్ పూలింగ్ కు చట్టబద్ధతే లేదన్నారు. గడచిన ఎన్నికల్లో టీడీపీకి పెట్టుబడులు పెట్టిన ప్రైవేట్ వ్యక్తులకు టీడీపీ సర్కారు గులాం గిరీ చేస్తోందని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి వెయ్యి ఎకరాలు సరిపోతాయని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News