: చివరి క్షణాల్లో 'ఫిలే' జీవితం... తోకచుక్కపై పరీక్షలు ముగిసినట్టే!


రష్యాతో కలసి యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ చేపట్టిన తోకచుక్కపై పరిశోధనలు అర్ధాంతరంగా ముగిసిపోనున్నాయి. రోసేట్టా అంతరిక్ష నౌక నుంచి తోకచుక్కపైకి దిగిన లాండర్ ఫిలేలో బాటరీల ఛార్జింగ్ అయిపోయిందని తెలుస్తోంది. ఫిలేకు అమర్చిన సోలార్ పానల్స్ సైతం తెరుచుకోలేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో తోకచుక్కపై పరిశోధనలు జరిపి, వాటి పుట్టుక రహస్యాలు తెలుసుకోవాలన్న ఆలోచనలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే ఇప్పటికీ ఫిలే చక్కగా పనిచేస్తోందని, తోకచుక్క చిత్రాలను భూమికి పంపిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఫిలే జీవితకాలం మాత్రం ముందుగా ఊహించినంత ఉండకపోవచ్చని, శనివారంతో ఫిలే నుంచి సిగ్నల్స్ ఆగిపోతాయని అంచనా వేస్తున్నామని వివరించారు. ఈలోగా సోలార్ ప్యానల్స్ తెరుచుకుంటే ఫిలే కొన్ని నెలలు పని చేస్తుందని తెలిపారు.

  • Loading...

More Telugu News