: నెహ్రూకు మోదీ ‘ట్విట్టర్’ నివాళులు!
భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. మూడు దేశాల పర్యటనలో ప్రస్తుతం ఆస్ట్రేలియా నగరం బ్రిస్ బేన్ లో ఉన్న మోదీ, ట్విట్టర్ లో నెహ్రూకు నివాళులర్పిస్తూ సందేశాలు పోస్ట్ చేశారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో నెహ్రూ పోషించిన పాత్ర అత్యంత కీలకమైనదని ఈ సందర్భంగా మోదీ కీర్తించారు. స్వాతంత్ర్యానంతరం దేశానికి తొలి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నెహ్రూ గణనీయ సేవలందించారని ఆ సందేశాల్లో మోదీ కొనియాడారు.