: సభ నుంచి బీజేపీ వాకౌట్


తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న సమయంలో ఈ అంశంపై వాడీవేడీ చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ నేత లక్ష్మణ్ మాట్లాడుతూ, విద్యార్థులు తక్కువగా ఉన్నారని పాఠశాలలను మూసివేయడం, ఉపాధ్యాయులను వేరే చోటికి బదిలీ చేయడం సమంజసం కాదని అన్నారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలకు 10 మంది రావడం కూడా గొప్పే అని... అలాంటి ప్రాంతాల్లో విద్యార్థులు తక్కువగా ఉన్నారంటూ స్కూళ్లను మూసేస్తారా? అని ప్రశ్నించారు. ప్రభుత్వ శైలిని బీజేపీ వ్యతిరేకిస్తోందన్న లక్ష్మణ్... సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News