: హద్దు మీరితే ఎవరినైనా సైన్యం శిక్షిస్తుంది: రక్షణ మంత్రి పారికర్
రక్షణ శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన మనోహర్ పారికర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. దేశ రక్షణ బాధ్యతల్లో అవిశ్రాంతంగా పనిచేస్తున్న సైన్యంలో ధైర్యాన్ని నింపుతూనే, హద్దు మీరితే సహించేది లేదని కూడా తేల్చి చెబుతున్నారు. మచిల్ బూటకపు ఎన్ కౌంటర్ కు సంబంధించి ఐదుగురు సైనికులపై చర్యలకు గురువారమే పచ్చ జెండా ఊపిన ఆయన శుక్రవారం తన ఉద్దేశాన్ని సుస్పష్టంగా వెల్లడించారు. "హద్దు మీరిన ఎవరిపైనైనా చర్యలు తీసుకునేందుకు సైన్యం వెనుకాడబోదు. ఈ విషయంలో సొంత సైనికులైనా క్షమించేది లేదు" అని ఆయన నర్మగర్భంగా వ్యాఖ్యానించారు.