: డిగ్రీ మార్కుల షీట్ ను ఫోర్జరీ చేసిన కేంద్ర విద్యా మంత్రి


ప్రొఫెసర్ కథేరియా... ప్రధాని నరేంద్ర మోదీ ఏరికోరి ఎంచుకున్న మంత్రి ఆయన. స్వతహాగా ప్రొఫెసర్. ఇప్పుడు మోదీ కేబినెట్లో విద్యా శాఖ సహాయ మంత్రి. మరో 12 రోజుల్లో ఆయనపై ఫోర్జరీ కేసు నమోదు కానుంది. గతంలో ఆగ్రా యూనివర్సిటీలో ఉద్యోగం కోసం తన డిగ్రీ మార్కుల షీట్ ను మార్చారన్నది ఆయనపై ఆరోపణ. డిగ్రీ రెండవ సంవత్సరంలో హిందీలో 43, ఇంగ్లిష్ లో 42 మార్కులు రాగా... వాటిని 52, 53గా మార్చారని, ఎంఏలోను ఒక సబ్జెక్టులో వచ్చిన 38 మార్కులను 72గా మార్చారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ కేసును తన ప్రత్యర్థి, 2009లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన బహుజన సమాజ్ పార్టీ నేత ఒకరు పెట్టారని కథేరియా ఆరోపించారు. గతంలో ఇదే ఆరోపణలపై మాయావతి నేతృత్వంలోని ప్రభుత్వం తనపై విచారణ జరిపి నిరపరాధినని తేల్చిందని వివరించారు. పోలీసులు ఆయనపై సెక్షన్ 420 కింద కేసు పెట్టి విచారణ ప్రారంభించారు. కేసు రుజువైతే 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు ఎన్నికల్లో పాల్గొనే అర్హత కోల్పోతారు. కాగా ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చిన సమాచారం మేరకు ఆయనపై మొత్తం 21 క్రిమినల్ కేసులు ఉన్నాయి.

  • Loading...

More Telugu News