: ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు... కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
గడచిన 36 గంటలుగా ప్రకాశం జిల్లలో కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ విజయకుమార్ శుక్రవారం సూచించారు. పలు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా ఆయా ప్రాంతాల్లో సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దని ఆయన ప్రజలను కోరారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. జిల్లా కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్షాల వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా కంట్రోల్ రూమ్ నెంబ్లర్లు : 08592 281400, లేదా టోల్ ఫ్రీ నంబర్ : 1077కు ఫోన్ చేయాలని సూచించారు.