: మద్యం విక్రయాలపై నియంత్రణే... నిషేధం అమలు చేయలేం: చంద్రబాబు


రాష్ట్రంలో మద్యపానాన్ని నిషేధించలేమని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. అయితే మద్యం విక్రయాలపై నియంత్రణను మాత్రం కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం ఆ దేశ పారిశ్రామికవేత్తలతో జరిగిన చర్చాగోష్ఠి సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తోంది, కేరళ కూడా అదే దిశగా సాగుతోంది, మరి మీరెందుకు ఆ దిశగా చర్యలు చేపట్టలేదని సింగపూర్ పారిశ్రామికవేత్తలు చంద్రబాబును ప్రశ్నించారు. దీనికి స్పందించిన చంద్రబాబు, రాష్ట్రంలో మద్య నిషేధం అమలు చేసే పరిస్థితులు లేవని, అమ్మకాలపై నియంత్రణ మాత్రం కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. అయితే నిషేధం ఎందుకు విధించలేరన్న దానికి కారణాలను మాత్రం చంద్రబాబు చెప్పలేదు. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలోని టాప్ 3 రాష్ట్రాల జాబితాలో నిలుపుతానని ఆయన ప్రకటించారు. రాష్ట్రానికి పెట్టుబడులతో వచ్చే పారిశ్రామికవేత్తలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News