: మా మనోభావాలను దెబ్బతీశాడు... సల్మాన్ పై చర్యలు తీసుకోండి


బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రతి రోజూ ఏదో ఒక విధంగా వార్తల్లో నానుతూనే ఉంటాడు. 2013లో జరిగిన బిగ్ బాస్ రియాల్టీ షోలో ముస్లింల మనోభావాలను సల్మాన్ దెబ్బతీశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అప్పట్లో తాము ఫిర్యాదు చేశామని... అయినా పోలీసులు ఇంతవరకు చర్యలు తీసుకోలేదని హైదరాబాద్ కు చెందిన మహ్మద్ ఫసీయుద్దీన్ అనే వ్యక్తి ఆరోపించారు. తన లాయర్ అబ్బాస్ తో కలసి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని వెల్లడించారు. బిగ్ బాస్ షోలో కుక్కను స్వర్గంలా చిత్రీకరించారని... ఈ వ్యవహారంపై బంజారాహిల్స్, ఫలక్ నుమా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశామని చెప్పారు. తన సోదరి పెళ్లి కోసం సల్మాన్ ఫలక్ నుమా ప్యాలెస్ కు వస్తున్నారని... ఈ సందర్భంలో సల్మాన్ ను పోలీసులు విచారించాలని డిమాండ్ చేశారు. పోలీసుల వైఖరికి నిరసనగా ఈ నెల 16న పీఎస్ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. సల్మాన్ తో పాటు అందులో నటించిన సైఫ్ అలీ ఖాన్ పై చర్యలు తీసుకునేలా తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.

  • Loading...

More Telugu News