: హైకోర్టు చెప్పినా కేసీఆర్ మారలేదా?
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఆర్థిక సాయం (ఫాస్ట్) పథకం అమలు చేయడానికి 1956వ సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకునే ఆలోచన ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి చెప్పారు. శాసనసభలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అరుణ, చిన్నారెడ్డి అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. దీంతో, 1956 స్థానికతను కేసీఆర్ ఇంకా వదల్లేదనే విషయం అర్థమవుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే హైకోర్టు వ్యతిరేకంగా స్పందించినా టీఎస్ ప్రభుత్వ ఆలోచనలు మాత్రం 1956 చుట్టూనే తిరుగుతున్నాయని వారు అంటున్నారు.