: ఒక్కో రన్ కు రూ. వెయ్యి... రోహిత్ కు ఈడెన్ నజరానా!
వన్డే క్రికెట్ లో అనితర సాధ్యమైన రికార్డును నమోదు చేసిన తెలుగు తేజం రోహిత్ శర్మపై ఈడెన్ గార్డెన్ నజారానా ప్రకటించింది. 150 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈడెన్ సంబరాలకు తెరలేచింది. సరిగ్గా అదే సమయంలో రోహిత్ అనిర్వచనీయ రీతిలో 264 పరుగులు సాధించి, అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేయడంతో పులకించిపోయింది. రోహిత్ అరుదైన రికార్డు తమ సంబరాలకు మరింత గుర్తింపు తెచ్చిందన్న భావనతో ఒక్కో పరుగుకు రూ. వెయ్యి చొప్పున రోహిత్ కు నజరానా ప్రకటించింది. అంటే, 264 పరుగులు చేసిన రోహిత్ కు ఈడెన్ గార్డెన్ నుంచి రూ. 2.64 లక్షల నజరానా అందనుందన్న మాట.