: గ్యాస్ సిలిండర్లకు రేపటి నుంచి నగదు బదిలీ... తొలి విడతగా 12 జిల్లాల్లో అమలు


గ్యాస్ సిలిండర్లకు నగదు బదిలీ పథకం పున:ప్రారంభం కానుంది. రేపటి నుంచి ఈ పథకం అమల్లోకి వస్తోంది. తొలి విడతలో తెలంగాణలోని మూడు జిల్లాలు, ఏపీలోని తొమ్మిది జిల్లాల్లో నగదు బదిలీని అమలు చేస్తారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఏపీలో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అమలు చేస్తారు. ఈ పథకం ద్వారా వినియోగదారుడికి నాన్ సబ్సిడీ ధర అయిన రూ. 952కు గ్యాస్ సిలిండర్ అందిస్తారు. అనంతరం సబ్సిడీ మొత్తం రూ.508 వినియోగదారుడి ఖాతాకు మళ్లిస్తారు.

  • Loading...

More Telugu News