: 153 పరుగుల తేడాతో ఓడిన శ్రీలంక... క్లిన్ స్వీప్ కు అడుగు దూరంలో టీమిండియా
కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన నాలుగో వన్డేలో 153 పరుగుల భారీ తేడాతో శ్రీలంక ఓటమి చవిచూసింది. 405 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక 48 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో దిల్షాన్ (34), తిరుమన్నె (59) తో కలిసి కెప్టెన్ మాధ్యూస్ (75) జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. వారిద్దరూ అవుట్ కావడంతో పెరీరా (29) కాసేపు టీమిండియా బౌలర్లను ప్రతిఘటించాడు. కులకర్ణి పది పరుగుల వ్యవధిలో తిరుమన్నె, పెరీరా, ప్రసన్న, కులశేఖరల వికెట్లు తీయడంతో టీమిండియా విజయం సాధించింది. 43.1 ఓవర్లలో శ్రీలంక 251 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా 153 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా రోహిత్ నిలిచాడు.