: 2 కోట్ల హవాలా సొమ్ము స్వాధీనం
హవాలా ద్వారా అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్న నలుగురిని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు వారు వెల్లడించారు. కాగా, నల్లధనం వెలికితీతపై కేంద్రం కృతనిశ్చయంతో ఉండడంతో నల్లధనం హవాలా మార్గాల్లో దేశం చేరుతోంది. దీంతో హవాలా వ్యవహారాలపై పోలీసులు కన్నేశారు. ఈ నేపథ్యంలో వీరు పట్టుపడ్డారు.