: రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ రిటార్ట్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'స్వచ్ఛ భారత్' కార్యక్రమం ఫోటోలు దిగడం కోసమేనంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించడంపై బీజేపీ రిటార్ట్ ఇచ్చింది. మహాత్మాగాంధీ కలలు కన్న క్లీన్ ఇండియాను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అవహేళన చేస్తున్నారని బీజేపీ మండిపడింది. ఈ మేరకు ఆ పార్టీ నేత నళిని కోహ్లీ మాట్లాడుతూ, రాహుల్ రాజకీయ జీవితమే ఫోటోలతో ముడిపడివుందని అన్నారు. "లోకల్ ట్రైన్స్ లో ప్రయాణించడం, దళితుల ఇళ్లకు వెళ్లడం, ఆర్డినెన్స్ ను చించివేయడం... ఇదంతా పూర్తిగా రాహుల్ ఫోటోల కోసమే చేశారు" అని వ్యాఖ్యానించారు.