: ఢిల్లీ ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ తొలి జాబితా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ముందడుగేసింది. ఎలాగైనా విజయం సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆ పార్టీ చూస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ ఫ్రకటించకముందే అభ్యర్థులను సిద్ధం చేసుకుని, 22 మందితో జాబితా విడుదల చేసింది. ఈ మేరకు ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆప్ నేత సంజయ్ సింగ్, అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఇప్పటికే 'ఢిల్లీ డైలాగ్' పేరుతో దేశ రాజధానిలో ఏఏపీ ప్రచారం నిర్వహిస్తోంది.