: మత బీజాలు నాటుతున్న మోది: కాంగ్రెస్ నేతల విమర్శ
భారత ప్రజల మధ్య మతోన్మాదమనే విష బీజాలను ప్రధాని మోదీ నాటుతున్నారని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. ఈ విషయంలో పార్టీ కార్యకర్తలు ఏకతాటిపై ఉండి బీజేపీని అడ్డుకోవాలని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పిలుపునిచ్చారు. దేశం ఐక్యంగా ఉండాలని నెహ్రు తన పాలనలో ఎంతో కృషి చేశారని అయన అన్నారు. ఢిల్లీలోని తల్కొటోరా స్టేడియంలో నెహ్రూ 125వ జయంత్యుత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.