: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో 7 ఎంఎఫ్ సిలు


ఆదాయ వనరులను మరింతగా పెంచుకోవాలని భావిస్తున్న దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరో 7 స్టేషన్ లను ఎంఎఫ్ సి (బహుళ ప్రయోజన సముదాయం) లుగా గుర్తించి అభివృద్ధి నిమిత్తం ప్రైవేటు కంపెనీలకు అప్పగించింది. ధర్మవరం, కాచిగూడ, కరీంనగర్, నెల్లూరు, నిజామాబాదు, విజయవాడ మరియు జహీరాబాద్ స్టేషన్ లను ఎంఎఫ్ సిలుగా అభివృద్ధి చేయనున్నట్టు రైల్వే భూముల అభివృద్ధి మండలి ప్రకటించింది. ఇందుకోసం మొత్తం 22.34 కోట్ల రూపాయలను వెచ్చించనున్నట్టు తెలిపింది. ఈ స్టేషన్ లలో ప్రయాణికులు విశ్రాంతి తీసుకునేందుకు బడ్జెట్ హోటల్స్ తో పాటు షాపింగ్ జోన్లు, రెస్టారెంట్ లు, ఏటిఎంలు, మెడికల్ షాప్ లతో పాటు డిమాండ్ ను అనుసరించి వివిధ రకాల స్టోర్స్ ఉంటాయని, కాంట్రాక్టు పొందిన సంస్థకు నిర్మించి 30 నుంచి 45 సంవత్సరాలపాటు నిర్వహించే ప్రాతిపదికన హక్కులు ఉంటాయని రైల్వే అధికారి ఒకరు తెలిపారు.

  • Loading...

More Telugu News