: ఈ'డెన్' లో రో'హీట్'...డబుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు


ఈడెన్ గార్డెన్స్ లో రోహిత్ శర్మ చెలరేగిపోయాడు. శ్రీలంక బౌలర్లను చెండాడుతూ ప్రపంచ రికార్డు కైవసం చేసుకున్నాడు. వన్డేల్లో రెండుసార్లు డబుల్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్ మన్ గా రోహిత్ చరిత్రలో నిలిచాడు. ప్రతి క్రికెటర్ కలలు కనే ఈడెన్ గార్డెన్స్ లో రోహిత్ శర్మ అనితరసాధ్యమైన ఆటతీరుతో డబుల్ సెంచరీ చేశాడు. ఈడెన్ గార్డెన్ లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్ మన్ గా రికార్డులకెక్కిన రోహిత్, వన్డేల్లో రెండుసార్లు డబుల్ సెంచరీలు సాధించిన వ్యక్తిగా వినుతికెక్కాడు. సహచరులు వెనుదిరుగుతున్నా చెదరని ఏకాగ్రతతతో రోహిత్ కేవలం 161 బంతుల్లో 29 ఫోర్లు, 7 సిక్సులతో 232 పరుగులు సాధించాడు.

  • Loading...

More Telugu News