: కేసీఆర్, హరీష్ కు మతిభ్రమించింది: మంత్రి బొజ్జల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మేనల్లుడు మంత్రి హరీష్ రావుకు మతిభ్రమించినట్టుందని ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఆరోపించారు. చిత్తూరులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో విద్యుత్ సమస్యకు ఏపీ ముఖ్యమంత్రి కారణమని ఆ రాష్ట్ర అసెంబ్లీలో పేర్కొనడం సరికాదని హితవు పలికారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారని ఆయన వారిద్దరిపై మండిపడ్డారు. తెలంగాణలోని ప్రతి సమస్యకు కారణం బాబు అంటే ఎట్లా? అని ఆయన ప్రశ్నించారు. పరిపాలన చేతకాక వారిద్దరూ అవాకులు చవాకులు పేలుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.