: ఏపీ రుణమాఫీ అర్హుల జాబితాలో 58 లక్షల మంది రైతులు
ఆంధ్రప్రదేశ్ లో రుణమాఫీ పొందే అర్హత గల రైతుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకూ ఈ జాబితాలో 58 లక్షల మంది రైతులు చేరారని రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు కుటుంబరావు తెలిపారు. ఈ క్రమంలో ఆధార్, రేషన్ కార్డులాంటివి సమర్పించేందుకు ఈరోజు సాయంత్రం వరకు గడువు ఉందని చెప్పారు. మరోవైపు రుణమాఫీ అర్హుల జాబితాను అప్ లోడ్ చేసేందుకు మరొక రోజు గడువు ఇవ్వాలని బ్యాంకులు కోరుతున్నాయని కుటుంబరావు వెల్లడించారు. కాగా, బ్యాంకులకు పంపిన జాబితాలో పేర్లున్నవారు తక్షణమే తమ ధృవపత్రాలను సమర్పించాలని, అలా ఇస్తేనే తొలివిడతలో ప్రభుత్వం ఇచ్చే 20 శాతం రుణమాపీ లభిస్తుందనీ అన్నారు.