: సైగలకనుగుణంగా స్పీకర్ చర్యలు తీసుకుంటున్నారు: జానారెడ్డి
స్పీకర్ గారు ఒకవైపే చూస్తున్నారని తెలంగాణ శాసనసభలో ప్రతిపక్షనేత జానారెడ్డి ఆరోపించారు. శాసనసభలో టీడీపీ సభ్యుల సస్పెన్షన్ అనంతరం ఆయన మాట్లాడుతూ, స్పీకర్ అధికార పక్షం నేత సైగలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. పొరపాటుగా రెండు చోట్ల కుటుంబ సభ్యుల పేర్లు నమోదై ఉండవచ్చని, దానిపై టీడీపీ నేతలు పట్టుపట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.