: పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ పెంపు


అంతర్జాతీయ చమురు ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి తగ్గనున్న సంగతి తెలిసిందే. ఇదే అదునుగా భావించిన ప్రభుత్వం ఆ రెండింటిపై ఎక్సైజ్ సుంకాన్ని పెంచింది. దాంతో, సాధారణ పెట్రోల్ పై లీటరుకు రూ.1.20 పైసల నుంచి రూ.2.70 పైసలు పెంచింది. అదే సమయంలో బ్రాండెడ్ పెట్రోల్ పై రూ.2.35 పైసలు నుంచి రూ.3.85 పైసలకు పెంచింది. ఇదిలా ఉంటే అన్ బ్రాండెడ్ డీజిల్ పై లీటరుకు రూ.1.46 పైసల నుంచి రూ.2.96 పైసలు పెంచగా, బ్రాండెడ్ డీజిల్ పై రూ.3.75 పైసల నుంచి రూ.5.25 పైసలకు పెంచింది.

  • Loading...

More Telugu News