: నెహ్రూ లేకుంటే చంద్రయాన్, మంగళ్ యాన్ సాధ్యం కావు: సోనియా


పండిట్ జవహర్ లాల్ నెహ్రూ లేకుంటే చంద్రయాన్, మంగళ్ యాన్ లాంటి ప్రయోగాలు సాధ్యపడేవి కాదని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. ఢిల్లీలోని తల్కొటోరా స్టేడియంలో ప్రారంభమైన భారత తొలి ప్రధాని నెహ్రూ 125వ జయంతి ఉత్సవాల్లో సోనియా ప్రసంగించారు. అంతరిక్ష ప్రయోగాల కోసం నెహ్రు ఎంతో కృషి చేసారని, వాటి ఫలితమే ఇప్పటి విజయాలని ఆమె అన్నారు. 'ఇప్పటివరకు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాం. అంతేకాకుండా మన నేతల నుంచి సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో కూడా నేర్చుకున్నాం' అని ఆమె అన్నారు. సిద్ధాంతాలకు, సంప్రదాయాలకు కట్టుబడి ఉన్నామని, జాతి పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పాత్ర గర్వకారణమని సోనియా కొనియాడారు. భారత దేశ ఐక్యతకు నెహ్రూ విజన్ ఉపయోగపడిందని సోనియా అభిప్రాయపడ్డారు. దేశ పురోగతిని, స్వేచ్ఛను హరించాలని చూస్తున్న దుష్ట శక్తులతో పోరాటం చేస్తామని సోనియా తెలిపారు.

  • Loading...

More Telugu News