: ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కిరణ్ బేడి!


త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఒకప్పటి పోలీసు అధికారిణి కిరణ్ బేడీ పేరును ప్రధానమంత్రి నరేంద్ర మోది పరిశీలిస్తున్నట్టు తెలిసింది. ఆమెపై నమోదైన చీటింగ్ కేసును ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఉపసంహరించుకున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన క్లోజర్ రిపోర్టును తయారు చేసి ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించారు. త్వరలోనే ఆమె బీజేపీలో చేరుతారని ఆ పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఆమె పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తో కలసి పనిచేసిన కిరణ్ బేడీ, ఆపై పరిస్థితులు మారిన నేపథ్యంలో మోది ప్రభుత్వానికి ట్విట్టర్‌ ద్వారా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. తన ట్రస్టులు ఇండియా విజన్ ఫౌండేషన్, నవజ్యోతి ఫౌండేషన్‌లకు మైక్రోసాఫ్ట్ విరాళంగా ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేశారని కిరణ్ బేడీపై 2011 నవంబర్ లో కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News