: ఆస్ట్రేలియాలో పరుగు పెట్టనున్న 'మోది ఎక్స్ ప్రెస్'


మెల్బోర్న్ నుంచి సిడ్నీకి 'మోదీ ఎక్స్ ప్రెస్' పేరిట ఓ ప్రత్యేక రైలు వెళ్లనుంది. ఆస్ట్రేలియా రైల్వే చరిత్రలో ఒక ప్రధాని పేరిట రైల్ సర్వీస్ నడపటం ఇదే తొలిసారి. సిడ్నీలో సోమవారం నాడు జరిగే మోదీ బహిరంగ సభకు సుమారు 200 మంది ఈ రైల్ లో మెల్బోర్న్ నుంచి వెళ్లనున్నారు. దాదాపు 28 సంవత్సరాల తరువాత ఒక భారత ప్రధాని ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాలోని బీజీపీ అభిమానులు ఈ ప్రత్యేక ట్రైన్ ను ఏర్పాటు చేసుకున్నారు. రైల్ లోని అన్ని టికెట్స్ బుక్ అయిపోయాయని ఓవర్ సీస్ ఫ్రెండ్స్ అఫ్ బీజేపీ మెల్బోర్న్ అధ్యక్షుడు అశ్విన్ బోరా వెల్లడించారు. స్థానిక రైల్వే అధికారుల సహకారంతో ట్రైన్ ను మూడు రంగుల బెలూన్లు, మోదీ చిత్రాలు, వివిధ రకాల పోస్టర్లతో అలంకరించనున్నట్టు తెలిపారు. ప్రయాణికులకు ఉచితంగా ఆహారాన్ని అందించనున్నామని, 'మోదీ డోక్లా' తదితరాలతో మెనూను సిద్ధం చేసామని వివరించారు.

  • Loading...

More Telugu News