: ఆరోపణలు చేసిన వారే విచారణ చేసుకోవచ్చు: కేంద్ర మంత్రి సుజనా చౌదరి


కేంద్ర మంత్రి సుజనా చౌదరి విపక్ష పార్టీల నేతలకు బంపర్ ఆఫరిచ్చారు. తనపై అతినీతి ఆరోపణలు చేసిన వారే తనపై విచారణ చేసుకోవచ్చని ప్రకటించి, ఆయన కొత్త తరహాలో ఎదురు దాడికి దిగారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సుజనా చౌదరిపై కాంగ్రెస్ తో పాటు పలు విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. అయితే వాటిని లైట్ తీసుకున్న సుజనా చౌదరి కేంద్ర మంత్రి పదవి చేపట్టిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ వచ్చారు. వచ్చీరాగానే పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు ఆయన వెళ్లారు. అక్కడ ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మాట్లాడిన సుజనా, తనపై ఆరోపణలు చేసిన వారు తనపై ఎలాంటి విచారణ అయినా చేసుకోవచ్చని తెలిపారు. నెలలో రెండు, నాలుగు శనివారాల్లో పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News