: 'స్వచ్ఛ భారత్' కేవలం ఫొటోల కోసమే: రాహుల్ గాంధీ


ప్రధానమంత్రి నరేంద్రమోదీ 'స్వచ్ఛ భారత్ అభియాన్' కార్యక్రమంపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమం కేవలం ఫొటోలు దిగే అవకాశం కోసమేనని వ్యాఖ్యానించారు. దేశ పునాదిని బీజేపీ బలహీనపరుస్తోందని నిందించారు. ఎప్పుడైతే పునాదులు బలహీనపడతాయో, దేశ శత్రువులు లాభపడతారని పేర్కొన్నారు. ఢిల్లీలోని తల్కాటొర స్టేడియంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ తన ప్రసంగంలో పైవిధంగా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News