: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా!
శ్రీలంకతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేటి నాలుగో వన్డే మ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచింది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ బ్యాటింగ్ ఎంచుకుని లంకకు బౌలింగ్ అప్పగించాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా జట్టులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఓపెనర్ శిఖర్ ధావన్ స్థానంలో స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ బరిలోకి దిగుతున్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్ లో స్టువర్ట్ బిన్ని, ధవల్ కులకర్ణిలను బరిలోకి దింపేందుకు కోహ్లీ నిర్ణయించాడు. అజింక్య రహానేతో కలసి రోహిత్ శర్మ టీమిండియా బ్యాటింగ్ ను ప్రారంభించనున్నాడు.