: పాక్ సర్కార్ కు ధైర్యం ఉంటే నన్ను అరెస్టు చేయాలి!: ఇమ్రాన్ ఖాన్


పాకిస్థాన్ పార్లమెంట్, పీటీవీ భవనంపై దాడి కేసులో యాంటీ టెర్రరిజం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేయడంపై తెహ్రీక్ ఏ ఇన్ఫాఫ్ పార్టీ అధినేత ఇమ్రాన్ ఖాన్ స్పందించారు. ధైర్యం ఉంటే తనను అరెస్టు చేయాలని పాక్ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. అయితే, ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకునేందుకు నిరాకరించిన ఇమ్రాన్, తన అరెస్టు వారెంట్ గురించి ఓ శుభవార్త విన్నానన్నారు. దాడి జరిగిన రోజు తాను కంటైనర్ లో నిద్రపోతున్నానని, ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని పాక్ ఆన్ లైన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అయితే, ఈ నెల 30 తన పార్టీ ఇస్లామాబాద్ లో ఓ బహిరంగ సభ నిర్వహిస్తోందని, దానికి భయపడే 'మియా సాబ్' (పాక్ పీఎం నవాజ్ షరీఫ్) ప్రభుత్వం తనపై అరెస్టు వారెంట్ ఇచ్చినట్టుందని ఆరోపించారు. ఒకవేళ పార్టీ సభ జరిగేటప్పటికి తను అరెస్టయినా, సభ మాత్రం జరుగుతుందనీ, ఆ సభ పాక్ చరిత్రలో నిలిచిపోతుందనీ అన్నారు.

  • Loading...

More Telugu News