: కార్గిల్ లో మైనస్ 10కి చేరిన ఉష్ణోగ్రత


భారత్, పాకిస్తాన్ల మధ్య సరిహద్దు ప్రాంతమైన కార్గిల్, లేహ్ పరిధిలో బుధవారం మైనస్ 7 నుంచి మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో ఇదే అతి తక్కువ ఉష్ణోగ్రత. గడచిన 36 గంటల వ్యవధిలో కురిసిన మంచుకు రోడ్లపై 2 అడుగుల ఎత్తు మంచు పేరుకుపోయిందని అధికారులు వివరించారు. మరోవైపు శ్రీనగర్లో ఉష్ణోగ్రత 0.4 డిగ్రీలకు పడిపోయింది. వచ్చే 24 గంటల్లో మరింత తక్కువ ఉష్ణోగ్రత నమోదు కానుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అతి శీతల గాలులు వీస్తున్న ప్రాంతాలలో సరిపడా ఆహార నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వాధికారి ఒకరు అన్నారు.

  • Loading...

More Telugu News