: కేసీఆర్ పాలనపై ప్రజలు తిరగబడతారు: ఎంపీ గుత్తా
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. పెన్షన్లలో కోత విధించే కుట్ర జరుగుతోందని, అర్హులైన వారందరికీ పెన్షన్లు మంజూరు చేయకపోతే ఈ నెల 30న అన్ని కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై ఉద్యోగుల్లో కూడా ఆందోళన నెలకొందని చెప్పారు. కేసీఆర్ పూర్తిగా ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారని, రాబోయే రోజుల్లో కేసీఆర్ పాలనపై ప్రజలు తిరగబడతారని జోస్యం చెప్పారు.