: ప్రపంచవ్యాప్తంగా రూ.350 కోట్లు వసూలు చేసిన 'హ్యాపీ న్యూ ఇయర్'


బాలీవుడ్ చిత్రం 'హ్యాపీ న్యూ ఇయర్' రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు రూ.350 కోట్లు వసూలుచేసింది. భారత్ లో రూ.200 కోట్లు, ఓవర్ సీస్ ద్వారా 15 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఈ ఏడాది అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. షారుక్ సొంత చిత్ర నిర్మాణ సంస్థ 'రెడ్ చిల్లీస్' ఎంటర్ టైన్ మెంట్ సీఈవో వెంకీ మైసూర్ మాట్లాడుతూ, "హ్యాపీ న్యూ ఇయర్' వంటి మెగా ప్రాజెక్టుతో అసోసియేట్ అయినందుకు రెడ్ చిల్లీస్ టీమ్ గర్వంగా భావిస్తోంది. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్త ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నందువల్లే ఇంత విజయం సాధించింది" అని తెలిపారు.

  • Loading...

More Telugu News