: ఏడుగురు ఆర్మీ అధికారులకు జీవిత ఖైదు
జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా మాచిల్ సెక్టార్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఐదుగురు సైనికులకు జీవిత శిక్ష పడింది. ఈ కేసులో ఏడుగురూ నిందితులుగా రుజువవడంతో వారి సర్వీసు ప్రయోజనాలను కూడా సస్పెండ్ చేశారు. 2010లో జరిగిన ఘటనలో మహమద్ షఫి, షెహజాద్ అహ్మద్, రియాజ్ అహ్మద్ అనే ముగ్గురు యువకులను ఆర్మీ సైనికులు కాల్చి చంపారు. దాంతో కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఘటనపై పూర్తి దర్యాప్తు జరిగింది. ఈ తీర్పుతో బాధిత కుటుంబాలు సంతోషం వ్యక్తం చేశారు.