: సభ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్
తెలంగాణ శాసనసభ నుంచి టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ లు వాకౌట్ చేశాయి. రేషన్ కార్డుల పంపిణీ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఈ పార్టీలన్నీ నిరసించాయి. పేదల రేషన్ కార్డులను అన్యాయంగా తొలగిస్తున్నందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని టీడీపీ నేత ఎర్రబెల్లి స్పీకర్ కు తెలిపారు. తెల్ల రేషన్ కార్డులు చికిత్స చేయించుకునేందుకు పనికిరావని ఆర్థిక మంత్రి చెప్పడాన్ని నిరసిస్తూ వాకౌట్ చేస్తున్నామని బీజేపీ నేత లక్ష్మణ్ ప్రకటించారు. రేషన్ కార్డులను అడ్డగోలుగా తొలగిస్తూ పేదలకు అన్యాయం జరిగే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నందున వాకౌట్ చేస్తున్నామని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి తెలిపారు.