: 'లింగ' చిత్ర నిర్మాతలకు కోర్టు నోటీసు
సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న 'లింగ' చిత్ర నిర్మాతలకు మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ జడ్జ్ జస్టిస్ ఎం.వేణుగోపాల్ నోటీసు జారీ చేశారు. తమిళ నిర్మాత రవి రతినం దాఖలు చేసిన రిట్ పిటిషన్ ఆధారంగా కోర్టు పైవిధంగా స్పందించింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. దర్శకుడు కేఎస్ రవికుమార్ రూపొందిస్తున్న ఈ సినిమా కథ 2013లో రిలీజ్ అయిన తన చిత్రం 'ముల్లం వనమ్ 999' కథేనని ఆరోపిస్తూ పిటిషన్ లో పేర్కొన్నారు.