: పోలవరం బాధితులకు తెలంగాణలో పునరావాసం ఇవ్వండి: వైసీపీ


విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిన ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలోనే పునరావాసం కల్పించాలని అసెంబ్లీలో వైఎస్ఆర్ సీపీ కోరింది. ఈ మేరకు సభలో ఆ పార్టీ సభ్యుడు తాటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, ఎలాగైనా బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం రైతులు, ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని వివరించారు. కాబట్టి, శాసనసభ వేదికగా ప్రభుత్వం ఈ విషయంపై హామీ ఇవ్వాలని అడిగారు.

  • Loading...

More Telugu News