: ఇరాన్ లో మరో రెండు రష్యన్ అణు విద్యుత్ కేంద్రాలు


ఇరాన్ లో రష్యాకు చెందిన అణు విద్యుత్ కేంద్రాల సంఖ్య మూడుకు చేరుకోనుంది. ఇప్పటికే ఓ కేంద్రం అక్కడ కార్యకలాపాలు సాగిస్తుండగా, తాజాగా మరో రెండు కేంద్రాల ఏర్పాటుకు రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. ఈ కేంద్రాల్లో ఇరు దేశాలకు భాగస్వామ్యముంటుందని సదరు ఒప్పందాలు పేర్కొంటున్నాయి. అణ్వాయుధాల ఉత్పత్తి కోసమే ఇరాన్ కొత్త అను విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు పూనుకున్నదన్న పాశ్చాత్య దేశాల ఆరోపణలను ఆ దేశం కొట్టిపారేసింది. శాంతియుత ప్రయోజనాల కోసమే ఈ కేంద్రాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ఇరాన్ చెబుతోంది. ఇప్పటికే పాశ్చాత్య దేశాలతో ఇరాన్ కు పొసగకున్నా, ఆ దేశంలో మరిన్ని అణు విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా ప్రకటించడం గమనార్హం.

  • Loading...

More Telugu News