: తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తున్నాం: మంత్రి జగదీశ్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో తెలిపారు. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ ఏర్పాటుకు తీర్మానం చేశామని, త్వరలోనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ మండలిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అందుకు మంత్రి పైవిధంగా సమాధానమిచ్చారు. అయితే, కాంగ్రెస్ పాపాలు చేసి తమపై రుద్దుతోందని, విద్యార్థులపై కాల్పులు జరిపిన చరిత్ర వారిదని విమర్శించారు.