: బీజేపీ తొలి రోజే పాలించే హక్కు కోల్పోయింది: శివసేన
మహారాష్ట్రను పాలించే హక్కును గద్దెనెక్కిన తొలి రోజే బీజేపీ కోల్పోయిందని శివసేన విమర్శించింది. పాలించే నైతిక హక్కు ఫడ్నవిస్ సర్కార్ కు లేదని ఆ పార్టీ పత్రిక సామ్నా గురువారం నాటి సంపాదకీయంలో విరుచుకుపడింది. విశ్వాస పరీక్షలో బీజీపీ ప్రభుత్వం రాజ్యాంగ ప్రమాణాలను పాటించలేదని, ప్రజల నమ్మకాన్ని సైతం వారు కోల్పోయారని పేర్కొంది. ఓ కుంభకోణం చేసి వారు విశ్వాస పరీక్ష నెగ్గారని అంది. స్పీకర్ హరిబాబు బాగ్డే పైనా విమర్శలు చేస్తూ, ఆయనపై విపక్షాలు ఎంతో విశ్వాసం ఉంచితే దాన్ని అయన వమ్ము చేసారని పేర్కొంది.