: మెదక్ ను జిల్లా కేంద్రంగా ప్రకటించండి: జిల్లా కేంద్ర సాధన సమితి
మెదక్ పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్ర సాధన సమితి పట్టణంలో నేడు బంద్ కు పిలుపునిచ్చింది. జిల్లా పేరు మెదక్ గానే కొనసాగుతున్నప్పటికీ, జిల్లా కేంద్రం మాత్రం సంగారెడ్డిలో ఉన్న విషయం తెలిసిందే. జిల్లా కేంద్రాన్ని మెదక్ కు తరలించాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న మెదక్ వాసులు జిల్లా కేంద్ర సాధన సమితిగా ఏర్పడి పోరు సాగిస్తున్నారు. నేటి సాధన సమితి బంద్ కు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ సహా ఎంఆర్పీఎస్ మద్దతు ప్రకటించాయి. బంద్ సందర్భంగా ఆర్టీసీ డిపో నుంచి బస్సుల రాకపోకలను సమితి నేతలు అడ్డుకున్నారు. పట్టణంలోని వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడగా, పాఠశాలలకు సెలవు ప్రకటించారు.