: ప్రమాణ స్వీకారం చేసిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యేగా భూమా అఖిలప్రియ ప్రమాణస్వీకారం చేశారు. ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అసెంబ్లీలోని తన ఛాంబర్ లో ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూ, పార్టీ సీనియర్ నేత మైసూరారెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మే నెలలో జరిగిన సాధారణ ఎన్నికల సమయంలో శోభానాగిరెడ్డి అకస్మాత్తుగా మరణించడంతో, ఇటీవల నిర్వహించిన ఉప ఎన్నికల్లో ఆమె కుమార్తె అఖిలప్రియ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.