: కేసీఆర్ ను సీఎం చేయడానికి సోనియా ఓకే అన్నా, డిగ్గీరాజా అడ్డుకున్నారు: సర్వే


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సంబంధించి కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. వెయ్యేళ్లకు కూడా రాదనుకున్న తెలంగాణను ఇచ్చినందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాను కలిసేందుకు కేసీఆర్ వెళ్లారని... ఆ సమయంలో, తనకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కేసీఆర్ అన్నారని సర్వే వెల్లడించారు. కేసీఆర్ ను సీఎం చేసేందుకు సోనియా, రాహుల్ ఇద్దరూ అంగీకరించారని... అయితే, దిగ్విజయ్ సింగ్ దాన్ని పూర్తిగా వ్యతిరేకించి, అడ్డుకున్నారని తెలిపారు. కొందరు కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ పై ఒత్తిడి తెచ్చి ఆ ప్రతిపాదనను అడ్డుకున్నారని చెప్పారు. అప్పుడు కేసీఆర్ సీఎం కాకుండా ఏయే కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారో... వారే ప్రస్తుతం కేసీఆర్ కు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News