: గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో శిల్పారామాల ఏర్పాటు
హైదరాబాద్ స్థాయిలో ఏపీలోని పలు నగరాల్లో శిల్పారామాలను ఏర్పాటు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. శిల్పారామాల ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించాలని ఆయా జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి.